హారన్ కొట్టినా జరగలేదని ఓ బాలిక ఏం చేసిందంటే?

by Disha Web |
హారన్ కొట్టినా జరగలేదని ఓ బాలిక ఏం చేసిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కొంతమంది జనాలు చిన్న చిన్న విషయాలకు పెద్ద నిర్ణయాలు తీసుకొని దారుణాలకు పాల్పడుతుంటారు. ఒపికతో ఉండకుండా తొందరపాటు తనంతో కోపోద్రిక్తులు అయిపోతుంటారు. ఇలాంటి ఘటనే ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. ఓ బాలిక హారన్ కొట్టినా వ్యక్తి అడ్డుతప్పుకోలేదని దారుణానికి ఒడిగట్టింది.

వివారాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్‌లో ఓ బాలిక బైక్‌పై వెళ్తుండగా ఓ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అడ్డుగా వచ్చాడు. అతడికి చెవులు వినిపించకపోవడంతో ఎంత హారన్ కొట్టినా అడ్డుతప్పుకోలేదు. దాంతో కోపోద్రిక్తురాలైన బాలిక తన దగ్గర ఉన్న కత్తితో అతి కిరాతకంగా అతని మెడపై పొడిచి చంపేసింది. అతనికి చెవులు వినిపించకపోవడమే కాకుండా మాటలు కూడా రాకపోవడంతో అరవలేకపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలి కోసం వెతికి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Next Story