జగన్ రెడ్డి చేసేది సామాజిక న్యాయం కాదు సామాజిక ద్రోహం

by Dishanational1 |
జగన్ రెడ్డి చేసేది సామాజిక న్యాయం కాదు సామాజిక ద్రోహం
X

దిశ, ఏపీ బ్యూరో : దేశంలోని రాజకీయ నాయకుల్లో పచ్చి అబద్దాలు కోరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిన్నిస్ ‎రికార్దులకెక్కుతారని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ముఖ్యమంత్రి అండ్ కో అబద్దాలకు ఆస్కార్ అవార్డులు కూడా ఇవ్వొచ్చునని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పచ్చి అబద్దాలు కోరు, విధ్వంసకారుడైన జగన్ రెడ్డి తానే సామాజిక న్యాయం చేసి బడుగు,బలహీన వర్గాలను ‎ ఉద్దరించినట్టు ‎పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

'జగన్ రెడ్డి చేసింది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం. పల్నాడులో 12 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు వైసీపీ రౌడీమూకల చేతిలో హత్య గావించబడితే నిందితుల్లో ఒక్కరిపై అయినా చర్యలు తీసుకున్నారా? సామాజిక న్యాయం అంటే ఇదేనా? దారుణంగాహత్యగావించబడ్డ బీసీ నేత జాలయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్ ని అడ్డుకునేందకు ప్రయత్నించటం దారుణం. లోకేశ్ అంటే వైసీపీకి ఎందుకంత భయం. పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న అరాచకాలు భయటపడకూడదని ‎లోకేశ్ పర్యటనను అడ్డుకుంటారా? హత్యకు గురైన బాధిత కుబుంబ సభ్యులు ఆ హత్యల వెనుక పిన్నెల్లి హస్తం ఉందని చెబుతున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పల్నాడులో మారణ హోమం సృష్టిస్తున్న పిన్నెల్లిపై చర్యలు తీసుకోకపోగా బాధిత కుటుంబ పరామర్శకు వెళ్తున్న లోకేశ్ ‎పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు చేత నోటీసులిప్పిస్తారా? పరామర్శకు వెళ్తున్న వారికి మీ వల్ల అల్లర్లు జరిగి ప్రాణం నష్టం జరుగుతుందని, విద్వంసకర పరిస్ధిలు ఏర్పడి ఆస్తుల విద్వంసం జరుగుందని నోటీసులివ్వటానికి పోలీసులకు బుద్ది ఉందా ? ‎పోలీసులు తమ నైత్తిపై ఉన్న 3 సింహాలకు విలువనిచ్చి 3 ఏళ్లు అయినట్టుంది. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోగా జగన్ రెడ్డికి తొత్తులు వ్యవహరించటం దారుణం' అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు మంత్రి పదవులిచ్చామని అంటున్న సీఎం జగన్ వారి అధికారమంతా ‎తన సామంతరాజులైన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు కట్టబెట్టడమే సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. 3 ఏళ్ల పాలనలో సబ్ ప్లాన్ నిధులు సహా బీసీలకు చెందిన రూ. 26 వేల కోట్లు దారిమళ్లించటం సామాజిక న్యాయమా? సామాజిక ద్రోహమా? అని ప్రశ్నించారు. అంతేకాదు బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలను.. కార్యకర్తలను జగన్ రెడ్డి పొట్టనపెట్టకుంటున్నారని ఆరోపించారు. అధికార మదంతో బడుగు, బలహీన వర్గాల హక్కుల్ని కాలరాస్తున్నారు. జగన్ రెడ్డి చేసేది ‎ చేసేది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed