బెల్ట్ బంద్‌ సమావేశానికి పోలీసు ప్రొటెక్షన్ కావాలి: వీడీసీ

by Dishafeatures2 |
బెల్ట్ బంద్‌ సమావేశానికి పోలీసు ప్రొటెక్షన్ కావాలి: వీడీసీ
X

దిశ, భిక్కనూరు: బెల్ట్ బంద్‌కు మీ సహాయ సహకారాలు కావాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసన సభ్యుడు గంప గోవర్ధన్‌కు శుక్రవారం భిక్కనూరు మండలం కాచాపూర్ వీడీసీ, గ్రామ సేవా సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు. బెల్ట్ బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తున్నప్పటికీ, కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, ఆదివారం జరిగే సమావేశానికి మీ సహకారం అవసరంతో పాటు, పోలీసు బందోబస్తు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం భిక్కనూరు తహసీల్దార్ నర్సింలుకు సైతం కార్యాలయం చేరుకొని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పోలీస్ ప్రొటెక్షన్ కావాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ, గ్రామ సమితి సభ్యులతోపాటు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story