మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసుతో సంబంధం లేదు

by Disha Web Desk |
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసుతో సంబంధం లేదు
X

దిశ, కుత్బుల్లాపూర్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు చేసిన కుట్ర కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తమను ఇరికిస్తున్నారని బెయిల్ పై వచ్చిన రాఘవేందర్ రాజు, రవిలు తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు శుక్రవారం పేట్ బషీరాబాద్ పీఎస్‌కు హాజరైన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తాము సుచిత్రలోని హోటల్ లో ఉన్నట్లు, హత్యకు కుట్ర చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ పలుకుబడితో కేసులు పెట్టిస్తున్నారన్నారు. టీఆర్ఎస్‌లో కలువాలని ఒత్తిడి తెచ్చినా వినకపోవడంతోనే ఈ పనులు చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల అఫిడవిట్‌పై పిటిషన్ వేసినందుకు మంత్రి వేధిస్తున్నాడని, రూ.11 కోట్ల వరకు నష్టం జరిగేలా చేశారన్నారని తెలిపారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసి జైలుకు పంపించారని, చట్టంపై ఉన్న నమ్మకంతో ముందుకెళ్లి చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. సంబంధం లేదని వ్యక్తులను కలిసినట్లు కట్టుకథ అల్లినారన్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ రావుకు ఒరిజినల్ స్టోరీ ఇస్తామని, తీయాలంటే మంచి సినిమా అవుతుందని స్పష్టం చేశారు.

సుచిత్రలో లేమని, ఆ సమయంలో రాష్ట్రపతి భవన్‌లో ఉన్నామన్నారు. విమానం, ఆర్టీసీ టికెట్లు కూడా ఉన్నాయన్నారు. 22వ తేదీన ఎన్నికల కమిషన్ లేఖ ఇచ్చిందని, ఆ విషయంలో ఢిల్లీకి వెళ్లామన్నారు. ఫారూక్ అనే వ్యక్తి 11 కేసులతో రౌడీషీటర్‌గా ఉన్నారని, ఆ రోజు పోలీసుల కస్టడీలో ఉన్నారని, ఇదంతా కావాలనే శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు.

Next Story