ఉక్రెయిన్ పై యుద్ధం తర్వాత తొలిసారి విదేశాలకు పుతిన్

by Disha Web |
ఉక్రెయిన్ పై యుద్ధం తర్వాత తొలిసారి విదేశాలకు పుతిన్
X

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా దేశాన్ని విడిచారు. కాస్పియన్ సముద్ర తీర దేశాలతో బుధవారం సమావేశమయ్యేందుకు ఆయన తజికిస్తాన్ వెళ్తున్నట్లు రష్యా అధ్యక్షుడి ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత పుతిన్‌కు ఇదే మొదటి విదేశీ పర్యటన. ఈ మేరకు పుతిన్ తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మన్ తో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా అధ్యక్షుడు ఫిబ్రవరి ప్రారంభంలో బీజింగ్ లో పర్యటించారు. వింటర్ ఒలింపిక్స్ పై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన దేశం విడిచి రావడం ఇదే తొలిసారి. మరోవైపు ఇండోనేషియాలో నవంబర్ లో జరగనున్న జీ20 సదస్సుకు వెళ్లేందుకు పుతిన్ ఇప్పటికే అంగీకరించారు. యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా అధ్యక్షుడు పలు అంతర్జాతీయ సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో తాజా పర్యటనపై ఆసక్తి నెలకొంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed