వికారాబాద్ జిల్లాలో 'ఆర్టీవో' ఆగడాలు?.. రోజూ 20 నుంచి 30 వాహనాల సీజే టార్గెట్!

by Disha Web |
వికారాబాద్ జిల్లాలో ఆర్టీవో ఆగడాలు?.. రోజూ 20 నుంచి 30 వాహనాల సీజే టార్గెట్!
X

దిశ, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఆర్టీవో ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన ఆర్టీవో.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలపై రూ.లక్షల్లో ఫైన్లు వేయడమే కాక, బూతులు తిడుతూ బెదిరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఆర్టీవో తమకు వద్దంటూ ప్రజలు, వాహనదారులు పేర్కొంటున్నారు. చివరికి వాహనదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీవోకు లక్షల్లో లంచాలు ఇప్పించే ఏజెంట్లు, బ్రోకర్లు సైతం ఆర్టీవో తీరును వ్యతిరేకిస్తున్నారు.

నియంతల వ్యవహరిస్తున్న ఆర్టీవో..

రోజుకు 20 నుంచి 30 వాహనాలు సీజ్ చేయడం రూ. లక్ష, 2 లక్షల టార్గెట్‌గా పెట్టుకున్న ఆర్టీవో, గంట వ్యవధిలోనే టార్గెట్ పూర్తి చేసుకోవడమే కాక, నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నుంచి సెల్‌ఫోన్‌లు లాక్కొని నియంతలా ప్రవర్తిస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. వాహన ధ్రువపత్రాలు అన్నీ ఉండి ఏదో ఒక పత్రం లేకపోయినా అదే కారణాన్ని సాకుగా చూపి రూ.10 నుంచి రూ.30 వేల వరకు కింది స్థాయి అధికారులతో సీక్రెట్ కోడ్ పెట్టి మరి లంచాలు తీసుకుంటున్నారని ఆర్టీవోపై బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీక్రెట్ కోడ్‌తో దందా..!

ఫైన్ వేసే కాగితంపై 5,10, 20, 30, ఇలా తనకు నచ్చిన ఫిగర్ రాసి రౌండ్ చేసి మరి కిందిస్థాయి కానిస్టేబుల్‌కు ఆ పేపర్ ఇస్తాడు. అంతే ఆయన సీక్రెట్ కోడ్ ఫిగర్ ఇస్తేనే సదురు వాహనం తాళం మీ చేతుల్లో ఉంటుంది. లేదంటే అంతే అన్నట్లు దర్జాగా ఆర్టీవో కార్యాలయంలోనే బహిరంగంగా లంచాలకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల ముందు మాత్రం చట్టబద్ధంగా పనులు చేస్తున్నట్లు సీన్ చూపించి, సీసీ కెమెరాలు లేని రూమ్‌లలో ఈ సీక్రెట్ కోడ్ తతంగం జోరుగా నడుస్తున్నాడని ఏజెంట్లు, బ్రోకర్లు ఆరోపిస్తున్నారు.

పైన్ కట్టలేక సామాన్యులు ఇక్కట్లు

ఒకవేళ అడిగినంత లంచం ఇవ్వని పక్షంలో రూ.50 నుంచి రూ.80 వేలు ఆ పైనే ఫైన్‌లు వేసి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ రోడ్డు మీదకు వచ్చి, కర్మగాలి ఆర్టీవో బద్రు నాయక్‌కు దొరికితే చాలు రూ.5,000 నుంచి రూ.10,000 లంచం ఇవ్వాల్సి వస్తుంది. లేనిపక్షంలో వేలకు వేలు ఫైన్‌లు రాసి వాహనాలు బయటికి రాకుండా చేస్తూ తమ జీవితంలో చీకటి నింపుతున్నాడని సామాన్యులు కన్నీళ్లు పెడుతున్నారు.

చన్గోముల్ పీఎస్‌లో ఆర్టీవోపై ఫిర్యాదు..

కొన్ని సందర్భాల్లో అన్నీ ధ్రువపత్రాలు ఉన్నా పొరపాటున ఎదురు తిరిగితే చాలు, ఏదో ఒక కారణం చెప్పి చెప్పలేని విధంగా బూతులు తిడుతూ వాహనం కింద వేసి తొక్కి చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిగి పట్టణానికి చెందిన మహమ్మద్ తోపిక్ శనివారం చన్గోముల్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీవోపై ఫిర్యాదు చేయడం గమనార్హం. మటన్ (కటిక) వృత్తిలో ఉన్న తోపిక్ శనివారం పరిగి నుంచి మన్నెగూడ మీదుగా గూడ్స్ వాహనంలో మేకలు తీసుకుని వికారాబాద్ వెళ్తుండగా మన్నెగూడ దగ్గర బలవంతంగా వాహనాన్ని నిలిపి వేశారు. ఆర్టీవో కు వాహనానికి సంబంధించిన పర్మిషన్లు చూపించినప్పటికీ, అంత నా ఇష్టం.. నాకే ఎదురు తిరుగుతావా..? అంటూ బూతులు తిడుతూ సెల్ ఫోన్ లాక్కుని బలవంతంగా వాహనాన్ని సీజ్ చేశారని, ఆర్టీవో పై చర్యలు తీసుకోవాలని చన్గోముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతడితో పాటు అనేకమంది వాహనదారులు, ఏజెంట్లు సైతం లంచాలు తీసుకుంటున్నారని ఆర్టీవో పై ఆరోపిస్తున్నారు.

ఆర్టీవో బూతులు తిడుతున్నారు

మటన్ వ్యాపారం చేసే తాము గూడ్స్ వాహనంలో మేకలు తీసుకుని వెళ్తుంటాం. ఎప్పటిలాగే గత శనివారం పరిగి నుంచి వికారాబాద్‌కు మేకలను తీసుకువస్తుండగా, మన్నెగూడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపి, వాహనానికి సంబంధించిన పత్రాలు అడగడంతో మా డ్రైవర్ అందజేశారు. అయినా ఏదో సాకు చెప్పి మేకలను గూడ్స్‌లో ట్రావెల్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారని బూతులు తిడుతూ ఆర్టీవో భద్రునాయక్ తమను బెదిరించాడు. పైగా బలవంతంగా ఫోన్ లాక్కుని వాహనాన్ని సీజ్ చేశారు. అందుకే చన్గోముల్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీవోపై ఫిర్యాదు చేశాం. మహమ్మద్ అయూబ్ (గూడ్స్ వాహన యజమాని)

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed