మోడీ నాయకత్వంలో పరుగులు పెడుతున్న దేశం: Vijayashanti

by Vinod kumar |
మోడీ నాయకత్వంలో పరుగులు పెడుతున్న దేశం: Vijayashanti
X

దిశ, అంబర్ పేట్: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. ఈ మేరకు బుధవారం భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ జెండాను విజయశాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. 42 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి, ప్రస్తుతం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందనన్నారు.


ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూస్తున్నాయని వివరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..1980 వ సంవత్సరంలో ఏర్పడిన బీజేపీ 1984 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలనే గెల్చుకుందని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కారణంగా ప్రజలు ఈ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్. గౌతమ్‌ రావు మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకురాలనే ఉద్దేశంతోనే బీజేపీ ముందుకు వెళ్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జి బి. వెంకట్‌ రెడ్డి, అట్లూరి రామక్రిష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఛాయా దేవి, క్రిష్ణగౌడ్, సందీప్ సాయి, దీపక్‌ రెడ్డి, కోశాధికారి సూర్య ప్రకాశ్ సింగ్, కార్పొరేటర్లు పద్మ వెంకట్ రెడ్డి, మహాలక్ష్మి రామన్ గౌడ్, అమృత, ఉమా రమేష్ యాదవ్, వనం రమేష్, కిలారి మనోహర్, సందీప్ యాదవ్, సుప్రియా గౌడ్, చిట్టి శ్రీధర్, అజయ్‌ గౌడ్, జ్యోతిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్, యశ్వంత్‌, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed