వివాదంలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో

by Disha Web Desk |
వివాదంలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వేములవాడ రాజన్న ఆలయంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. గురువారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాగా, కేంద్ర మంత్రి వస్తే సరైన విధంగా మర్యాదలు చేయలేదని, కేవలం రెండు రూములే కేటాయించారని ఆలయ ఈవో రమాదేవిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి రాజన్న ఆలయానికి వస్తే ఈఓ కనీసం ప్రొట్ కాల్ పాటించలేదంటూ మండిపడ్డారు. రెండు రూములే ఇస్తే సెక్యూరిటీ వారు ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు. మిగతా వారికి రూములు ఇవ్వద్దని సిబ్బందిని ఆదేశించడం విడ్డూరంగా ఉందని పీఆర్కే అసహానం వ్యక్తం చేశారు. ప్రతి పక్ష నాయకులు రాజన్న ఆలయానికి వచ్చిన ప్రతిసారీ ఈఓ అగౌరవ పరుస్తున్నారంటూ మండిపడ్డారు. ఉద్యోగులను వేధిస్తున్నారని, అధికార పార్టీ నాయకులు వస్తే రాచ మర్యాదలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు గుడికి రాకూడదా అని ప్రశ్నించారు.

ఆరోపణలను ఖండించిన ఈఓ

బీజేపీ నేతలు ఆరోపణలు అవాస్తవమని ఆలయ ఈఓ రమాదేవి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి టూర్ పై కమిషనర్, విజిలెన్స్ రూల్ ప్రకారం ప్రోటోకాల్ పాటించామని వెల్లడించారు. లోకల్ లీడర్‌లు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారని కామెంట్ చేశారు.

Next Story