- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూపీ మండలి ఎన్నికల్లో బీజేపీ సత్తా..
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల జోరును కొనసాగిస్తూ, 36 స్థానాలకు గాను 33 చోట్ల విజయం సాధించింది. అయితే ప్రధాని లోక్ సభ నియోజకవర్గమైన వారణాసిలో ఓటమి పాలైంది. ఈ స్థానంలో స్వతంత్ర మహిళా అభ్యర్థి గెలుపొందారు. కాగా, 36 లో 9 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 27 స్థానాలకు శనివారం ఓటింగ్ నిర్వహించారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాది పార్టీ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేకపోయింది. మూడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు.
100 సీట్లు ఉన్న శాసనమండలిలో ఎన్నికల ముందు బీజేపీ 34, ఎస్పీ 17, బీఎస్పీ 4 సీట్లను కలిగి ఉంది. తాజా విజయం పై సీఎం యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ విజయం సూచిస్తుందని అన్నారు. 'బీజేపీ మరోసారి ప్రధాని మోడీ నాయకత్వంలో ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలు జాతీయత, పురోగతి, సుపరిపాలన వైపే ఉన్నారు' అని ట్వీట్ చేశారు. ఎన్నికల కమిషన్ ప్రకారం రాయ్ బరేలీలో అత్యధికంగా 99.35శాతం ఓటింగ్ జరగ్గా, గోరఖ్ పూర్‌లో అత్యల్పంగా 96.50శాతం జరిగింది.