కీసరలో దారుణం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్య

by Disha Web Desk 2 |
కీసరలో దారుణం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తల్లి లేదన్న బెంగతో ఇద్దరు పిల్లల ఆత్మహత్య చేసుకున్న హృదయ విషాదకర సంఘటన రాంపల్లి దయారలో కలకలం రేపింది. కీసర పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కీసర మండలం రాంపల్లి దయార గ్రామానికి చెందిన మెట్టు శ్రీను రెడ్డి (58), ప్రమీల(54)లు దంపతులు. వీరికి మెట్టు మాధవరెడ్డి (35), మెట్టు యాదిరెడ్డి (30), మెట్టు మహిపాల్ రెడ్డి(28) ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా గండిపేట మ్యూజిక్ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కాగా, వీరి తల్లి ప్రమీల 2021 ఆక్టోబరు 21న మరణించింది. దీంతో ఆమె రెండో, మూడో కుమారులైన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డిలు తీవ్ర మనోవేధనకు గురయ్యారు. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.

బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డిలు తల్లిని తలుచుకుంటూ ఓ సూసైడ్ నోట్ రాశారు. అనంతరం యాదిరెడ్డి ఇంట్లో సిలింగ్ ఫ్యాన్‌కు ఊరేసుకుని, మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో ''మా అమ్మ ప్రేమ లేదు అని బాధతో చనిపోతున్నాము. మా మరణానికి ఎవరూ కారకులు కాదని తెలియజేస్తున్నాము.'' అని రాసి ఆత్మహత్యలకు పాల్పడటం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిసివేసింది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. బాధితుల తండ్రి మెట్టు శ్రీనురెడ్డి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story