యుద్ధ నేరాలకు శిక్ష తప్పదంటూ జెలన్ స్కీ వ్యాఖ్యలు

by Dishanational1 |
యుద్ధ నేరాలకు శిక్ష తప్పదంటూ  జెలన్ స్కీ వ్యాఖ్యలు
X

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ రష్యా పైలట్లకు కీలక హెచ్చరికలు చేశారు. కీవ్‌లోని నివాస భవనాలపై షెల్లింగ్ చేసిన రష్యన్లు పైలట్లను కనుగొంటామని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో సందేశాన్ని షేర్ చేశారు. 'పైలట్లు, విధ్యంసకారులు అందరూ అర్థం చేసుకొండి. మేము మిమ్నల్ని తప్పక కనుగొంటాం. తీర్పు మీ కోసం ఎదురు చూస్తుంది' అని అన్నారు. యుద్ధ నేరాలకు శిక్ష తప్పదని చెప్పారు. రష్యా మిసైల్స్ ఆదివారం కీవ్‌లోని కిండర్ గార్టెన్ చుట్టుముట్టి దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యాకు బెలారసియన్ల జీవితాలంటే విలువ లేదని అన్నారు. బెలారసియన్లు బానిసలు కాదని, అనవసరంగా చావాల్సిన పని లేదని చెప్పారు. సొంత నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. మరోవైపు జీ7 సదస్సు నేపథ్యంలో కీవ్‌పై రష్యా తాజాగా దాడులకు పాల్పడింది.


Next Story

Most Viewed