శ్రీ శుభకృత్ ఉగాది శుభ కామన

by Ravi |   ( Updated:2022-09-03 17:51:27.0  )
శ్రీ శుభకృత్ ఉగాది శుభ కామన
X

ఈ శుభకృతు ఆగమనం

శ్రీ శుభమస్తుగ సమస్త చింతలు తొలగన్

ఆశలు చిగురించాలని

ఆశిద్దా మవనిలోన అందర మొకటై !

ప్లవలో విప్లవ మట్టుల

భువి దూరే కరోన రుజము భూజన మెల్లన్

భవ భీతి తోడ మెలుగుతు

భవుని కృపన్ బతికిరి గద భయకంపితులై

ఈ యేడైనా, నరులీ

మాయామయ జగములోన మమతలు విరియన్

ఆయాస మంత విడిపోన్

ఆయా సౌఖ్యము నంది అలరార వలన్

శుభమొసుగు యేడు దయతో

నభయమ్మిడి యాదుకొనుచు నాత్మీయముగా

నభ మంటు సంబరాలిడి

సభలన్ శోభిల్లుగాక సంతస మొప్పన్

స్వాగతములు శుభకృతు నీ

రాగం మృత వర్షాధార లవనీ స్థలిన్

మాగాణులందు కురియగ

సాగవలెను యేరువాక సంతస మొప్పన్

రసస్రవంతి & కావ్యసుధ

7075505464-9247313488



Next Story

Most Viewed