టాటూలతో ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్

by Disha Web Desk 7 |
టాటూలతో ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్
X

న్యూఢిల్లీ: సరదా కోసం వేయించుకున్న టాటూ ప్రమాదాన్ని తీసుకొచ్చింది. తక్కువ ధరకే పచ్చబొట్టు వేసుకున్నందుకు ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తులు హెచ్‌ఐవీ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు టాటూలు వేసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జాగ్రత్తగా పరీక్షలు చేసి, కౌన్సెలింగ్ తర్వాత చాలా మంది హెచ్ ఐవీ పేషంట్లు టాటు వేసుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించామని పండిట్ దీన్ దయల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి డాక్టర్ ప్రీతి వెల్లడించారు. నగ్మా, బరగౌన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్లో లక్షణాలు గుర్తించినట్లు తెలిపారు. వీరితో పాటు మరో 14 మంది కూడా వైరస్ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీరికి జ్వరం రాగా టైఫాయిడ్, మలేరియాతో పాటు ఎన్ని టెస్టులు చేసిన తగ్గకపోగా, చివరికి హెచ్‌ఐవీ పరీక్ష చేసినట్లు తెలిపారు. అయితే పరీక్షలు వారందరిలోనూ హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే పరీక్షల తర్వాత శారీరకంగా కానీ, రక్త మార్పిడి వల్ల కానీ హెచ్ఐవీ వచ్చినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. వీరందరిలోనూ టాటూనే సాధారణంగా ఉందని అధికారులు గుర్తించారు. టాటూ వేయడానికి ఒకే సూది ఉపయోగించడమే దీనికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. టాటూలు వేసుకునేముందు జాగ్రత్త వహించాలని, సూది కొత్తదో కాదో చూసుకోవాలని తెలిపారు.


Next Story

Most Viewed