తుప్రాన్‌పేట్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Disha Web |
తుప్రాన్‌పేట్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా తుప్రాన్‌పేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న వ్యాన్‌ను అతివేగంగా వచ్చిన ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయాలపాలైన వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed