ప్రీమియం విభాగంలో 'రోనిన్ ' బైకును విడుదల చేసిన టీవీఎస్ మోటార్స్!

by Dishanational1 |
ప్రీమియం విభాగంలో రోనిన్  బైకును విడుదల చేసిన టీవీఎస్ మోటార్స్!
X

న్యూఢిల్లీ: భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రీమియం బైకుల విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో పట్టు సాధించేందుకు తన కొత్త మోడల్ 'రోనిన్ ' బైకును మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలుగా నిర్ణయించామని, దీని టాప్ వేరియంట్ ధర రూ. 1.68 లక్షల వద్ద ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత ప్రీమియం బైకుల మార్కెట్ 15 లక్షల వాటాతో వేగంగా పెరుగుతోంది. దేశీయ వినియోగదారులు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా 200-250సీసీ బైకులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే వినియోగదారులకు ప్రీమియం బైకులను అందించే లక్ష్యంతో రోనిన్ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. ఇది టీవీఎస్ నుంచి వచ్చిన తొలి రెట్రో స్క్రాంబ్లర్ బైక్. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్​ స్టార్టర్​ జెనరేటర్​తో వచ్చిన మొదటి ద్విచక్ర వాహనం ఇదేనని టీవీఎస్​ వెల్లడించింది. రోనిన్ ద్వారా రానున్న సంవత్సరాల్లో కంపెనీ మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంటుందని కంపెనీ సీఈఓ కె ఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. రోనిన్ బైక్ 225.9సీసీ సింగిల్​ సిలిండర్ ఆయిల్ కూల్డ్​ స్క్వేర్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. మొత్తం ఆరు రంగుల్లో ఒక్కో వేరియంట్ రెండు రంగుల్లో లభిస్తుంది. అలాగే, సింగిల్-ఛానల్ ఏబీఎఎస్, రియర్ వ్యూ మిర్రర్స్, మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ సహా పలు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed