నిరుద్యోగులకు టీఎస్​పీఎస్సీ షాక్.. ఏఎంవీఐ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా!

by Disha Web |
నిరుద్యోగులకు టీఎస్​పీఎస్సీ షాక్.. ఏఎంవీఐ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా!
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసిస్టెంట్ ​మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ల భర్తీ ప్రక్రియలో నిరుద్యోగులకు టీఎస్​పీఎస్సీ షాక్​ ఇచ్చింది. 113 పోస్టులకు శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకావాల్సి ఉండగా.. అత్యవసరంగా వాయిదా వేశారు. టీఎస్​పీఎస్సీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో అప్లికేషన్లు తీసుకోవడం సాధ్యం కావడం లేదని గురువారం రాత్రి ప్రకటించారు. గ్రూప్​ –1 దరఖాస్తుల ప్రక్రియ సందర్భంలో కూడా టీఎస్​ పీఎస్సీ వెబ్‌సైట్​ఇలాగే మొరాయించింది. పలు సందర్భాల్లో ఆగిపోయింది. తాజాగా ఈ నెల 5 నుంచి వచ్చేనెల 5 వరకు అసిస్టెంట్​మోటారు వెహికిల్​ఇన్ స్పెక్టర్​పోస్టుల భర్తీలో భాగంగా తొలి దశలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు వస్తున్నాయంటూ ప్రకటించిన టీఎస్​పీఎస్సీ.. దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతానికి వాయిదా పడిందని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ప్రకటన విడుదల చేశారు

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed