ఇంగ్లీష్ బోధనపై ప్రత్యేక నజర్: కలెక్టర్ హరీశ్

by Satheesh |
ఇంగ్లీష్ బోధనపై ప్రత్యేక నజర్: కలెక్టర్ హరీశ్
X

దిశ, ప్రతినిధి మేడ్చల్: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీశ్ అన్నారు. సోమవారం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవసేన, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన ఆన్ లైన్ సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ హరీశ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. మేడ్చల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు వచ్చే రెండు నెలల కాలంలో శిక్షణ అందించబోతున్నట్లు తెలిపారు. ఈ విధంగా వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు కొనసాగించడానికి పూర్తిస్థాయి సమర్థతతో ఉపాధ్యాయులు ఉండేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అని వివరించారు. ఈ విషయంలో తాను పూర్తిగా వ్యక్తిగతంగా శ్రద్ధ, బాధ్యత తీసుకొని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఇంగ్లీష్ బోధన విజయవంతమయ్యేలా చూస్తానని తెలిపారు.

Next Story