త్వరలో మెదక్‌లో రైలు సేవలు ప్రారంభం

by Disha Web Desk 12 |
త్వరలో మెదక్‌లో రైలు సేవలు ప్రారంభం
X

దిశ, మెదక్ : మెదక్‌లో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను ట్రయల్ రన్‌లో భాగంగా శనివారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సుమోయి మిత్ర ఆధ్వర్యంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అమిత్ గోయల్, డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్ర యాన్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్కన్నపేట్ రైల్వే స్టేషన్ నుంచి మెదక్ వరకు 17.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు 50 శాతం నిధులతో నిర్మించారు.

3 రైల్వే స్టేషన్లు కల్వర్టులు, వంతెనల నిర్మాణాల వద్ద తనిఖీలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా సిగ్నల్ వ్యవస్థ‌ను, ట్రాక్, సిగ్నల్, క్రాసింగ్ లను కూడా పరిశీలించామన్నారు. రైల్వే స్టేషన్‌ల నిర్మాణంతో పాటు ట్రాక్, వంతెనల నిర్మాణం పూర్తి అయిందనీ.. త్వరలో మెదక్ కు రైలు నడుపుతామని అధికారుల బృందం తెలిపింది. ఏప్రిల్ మొదటి వారంలో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.


Next Story

Most Viewed