రాష్ట్రపతి ముర్ము మాదిరిగా ఘనత సాధించిన ట్రైబల్ యువతి

by Dishanational1 |
రాష్ట్రపతి ముర్ము మాదిరిగా ఘనత సాధించిన ట్రైబల్ యువతి
X

దిశ, వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని పలుగు తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ వందన దంపతుల కూతురు ప్రియాంక 5 సంవత్సరాల వైద్యవిద్యను పూర్తి చేసుకున్నారు. ప్రియాంక హైదరాబాద్ లోని కాళోజీ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రుల బాటలో నడుస్తూ పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని ప్రియాంక పేర్కొంది. వైద్య విద్య పూర్తి చేసుకున్న ప్రియాంకను గ్రామస్తులు అభినందించారు.


Next Story