రెబ్బెన మండలంలో విషాదం.. వడదెబ్బతో ఉపాధ్యాయుడు మృతి

by Jakkula.Mamatha |

రెబ్బెన మండలంలో విషాదం చోటుచేసుకుంది.

రెబ్బెన మండలంలో విషాదం.. వడదెబ్బతో ఉపాధ్యాయుడు మృతి
X

దిశ, రెబ్బెన: రెబ్బెన మండలంలో విషాదం చోటుచేసుకుంది. నేర్పల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, పీఆర్టీయూ టీఎస్ నేత వెంకటేశ్వర్లు జనగణన డ్యూటీ ముగించుకుని రాగానే తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. వడదెబ్బ కారణంగా డీహైడ్రేషన్ ఏర్పడి, గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటేశ్వర్లు మృతిపై సమాచారం అందుకున్న రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సౌమ్య ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేర్పల్లి ఉపాధ్యాయుడి మృతి పట్ల జిల్లా పి.ఆర్.టి.యు (PRTU) ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, జిల్లా పి.ఆర్.టి.యు (PRTU) అధ్యక్షులు ఎటుకూరి శ్రీనివాసరావు, మండల పి.ఆర్.టి.యు (PRTU) అధ్యక్షులు బత్తుల సదానందం సంతాపం తెలియజేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

Next Story