తాటి చెట్టుపైనే గీత కార్మికుడు మృతి.. గ్రామంలో మిన్నంటిన రోదనలు!

by Jakkula.Mamatha |

ఎప్పటి లాగానే వృత్తిపరంగా కల్లు గీసే ప్రయత్నం చేస్తూ చివరికి చెట్టు పైనే మృతి చెందిన గీత కార్మికుని విషాద గాధ ఇది.

తాటి చెట్టుపైనే గీత కార్మికుడు మృతి.. గ్రామంలో మిన్నంటిన రోదనలు!
X

దిశ,తుంగతుర్తి: ఎప్పటి లాగానే వృత్తిపరంగా కల్లు గీసే ప్రయత్నం చేస్తూ చివరికి చెట్టు పైనే మృతి చెందిన గీత కార్మికుని విషాద గాధ ఇది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన చామకూరి వెంకన్న(56) ఉదయం కల్లు గీసే నిమిత్తం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీసి చెట్టు దిగుతుండగా మోకుజారి తల క్రిందులై ఊపిరాడక చెట్టుపైనే మృతి చెందారు. అయితే అటుగా వెళుతున్న కొంతమంది పరిస్థితిని గమనించి గ్రామస్తులకు తెలియపరిచారు. వెంటనే రప్పించిన క్రేన్ సహాయంతో తాటి చెట్టుపై వేలాడుతున్న వెంకన్న మృత దేహాన్ని కిందికి దించారు.

Next Story