ఈ రోజు ప్రత్యేకత: కార్గిల్ విజయ దినోత్సవం

by Disha Web |
ఈ రోజు ప్రత్యేకత: కార్గిల్ విజయ దినోత్సవం
X

దిశ, ఫీచర్స్: 'కార్గిల్ విజయ దినోత్సవం' ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999 జూలై 26న భారత సైన్యం పాకిస్థాన్‌పై విజయం సాధించినందుకు గుర్తుగా ఈ ప్రత్యేక రోజును నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. అయితే 1971 సిమ్లా ఒప్పందం ప్రకారం కార్గిల్ ప్రాంతంలో కాల్పులు జరిపేందుకు వీలు లేదు. కానీ కశ్మీర్‌ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది.

దీంతో 1999 మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్- పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దీనిని భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' అనే కోడ్‌తో పిలుచుకుంది. మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజులపాటు జరిగిన యుద్ధంలో పాక్ సైనికులతోపాటు 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న పాక్ సైన్యాన్ని తిప్పికొట్టిన భారత్ విజయం సాధించింది. ఇక ఈరోజున దేశప్రజలు వేడుకలు చేసుకుంటూ సైనికులకు జై కొట్టారు.



Next Story