నేటి రాశిఫలాలు : వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజు

by Disha Web |
నేటి రాశిఫలాలు :  వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజు
X

మేష రాశి : ఆర్థిక పరంగా కలిసివస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆకస్మిక ధనలాభం. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. ఈరోజు విద్యార్థులు,వారి పనులను రేపటికి వాయిదా వేయుటమంచిది కాదు,ఈరోజువాటిని పూర్తిచేయాలి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు.

వృషభ రాశి : అవసరమైన ధనములేకపోవటం కుటుంబలోఅసమ్మతికి కారణముఅవుతుంది. ఈసమయంలో ఆలోచించి మీకుటుంబసభ్యలతో మాట్లాడి వారియొక్క సలహాలను తీసుకోండి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి, ఉజ్జ్వలమైన, సంతోషదాయకమయిన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితున్ని కలుస్తారు.

మిథున రాశి : మీ వేగవంతమైన స్వభావం, మిమ్మల్ని లక్ష్యంవైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే, కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకొండి. అది మీవ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి, మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. మీరు మీయొక్క జీవితాన్ని సాఫీగా,నిలకడగా జీవించాలి అనుకుంటేమీరు ఈరోజు మీయొక్క ఆర్థికపరిస్థితిపట్ల జాగురూపకతతో ఉండాలి. ఉక్కిరిబిక్కిరిఅయే వార్తను పిల్లలు మీకు అందించవచ్చును. ఆందోళన పడకండిడ. మీ విచారం దానిలాగే ఈరోజే కరిగినీరైపోతుంది. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు మీరు చవిచూస్తారు. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

కర్కాటక రాశి : ఈరాశి వారు ఈరోజు ఖర్చులు తగ్గించడం మంచిది. ఎందుకంటే మీకు ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవాకాశం ఉంది. కావునా ఈరోజును మీరు డబ్బును ఆదాచేసి సమస్యలనుంచి బయటపడండి. కుటుంబంలో కళహాలు చికాకును తెప్పిస్తాయి. ఉద్యోగస్థులకు శ్రమ అధికం అవుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి.

సింహ రాశి : చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మీరు ఈరోజు వాటి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు డబ్బుఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చుపెట్టటమువలన మీయొక్క భవిష్యత్తుమీద ఎలాంటి ప్రతికూలప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే, వారి కోపానికి గురికావడమే అవవచ్చును. రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు, కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు.

కన్యా రాశి : త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. కుటుంబసభ్యుల మధ్య డబ్బుసంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. కొత్త పనులు ప్రారంభించక పోవడమే ఉత్తమమం. పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది.

తుల రాశి : ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఖర్చులు అధికం అవుతాయి. నిరుద్యోగులకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు ఈరోజు కలిసి వచ్చే రోజుగ చెప్పవచ్చు. చాలా కాలంగా పెండిగ్‌లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారులకు కలిసి వచ్చే రోజు.

వృశ్చిక రాశి : పని ఒత్తిడి అధికం అవుతోంది. ఈ రోజు మీ వ్యాపారంలో అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు. కుటుంబంలో సంతోషకరవాతావరణం ఉంటుంది. ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.వైవాహి జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.

ధనస్సు రాశి : సంతోషకరమైన రోజుకోసం, మానసిక ఆందోళనకు, వత్తిడికి దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ మిత్రులు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది . మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం

మకరరాశి : బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీదగ్గర అప్పుతీసుకున్నవారినుండి మీకుసమాచారం లేకుండా డబ్బుమీఖాతాలో జమచేయబడుతుంది.ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే, వారి కోపానికి గురికావడమే అవవచ్చును. మీకు ప్రియమైన వ్యక్తి, మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగే ఈరోజు మంత్తం మీరు టెన్షన్‌తో గడుపుతారు.

కుంభ రాశి : ఆర్థిక సమ్యలు మిమ్ముల్ని వెంటాడుతాయి. ఆకస్మికంగా సాయంత్ర వరకు మీకు డబ్బు చేతికి అందడంతో ఆనందంగా ఉంటారు. ఒక శుభవార్త ఇంటిల్లిపాదినీ ఆనందంలో ముంచెత్తుతుంది. చాలా రోజుల నుంచి వేధిస్తున్న మీ ఒంటరితనం ఓ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది. ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

మీన రాశి : ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం, మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు, అదనంగా జాగ్రత్తలు తీసుకొండి. రుణ బాధలు తీరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed