- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాసర గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు
by Batti.Sumithra |
బాసర అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబానికి చెందిన యువకులు మంగళవారం గోదావరిలో జలక్రీడలాడుతూ గల్లంతయ్యారు.

X
దిశ, బాసర : బాసర అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబానికి చెందిన యువకులు మంగళవారం గోదావరిలో జలక్రీడలాడుతూ గల్లంతయ్యారు. స్థానికులు పోలీసుల సమాచారం మేరకు అమ్మవారి దర్శనార్థం రాష్ట్ర రాజధానిలోని కాచిగూడ చప్పల బజార్ కు చెందిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ (38), రామచందర్(36), మల్లేష్ కుమార్ (31) అనే యువకులు పుణ్య స్నానాల నిమిత్తం గోదావరిలో స్నానమాచరిస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గోదావరిలో గల్లంతైన వారి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఘటనను పర్యవేక్షిస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






