రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

by Batti.Sumithra |

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన దామరచర్ల మండలం వాడపల్లి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి
X

దిశ, మిర్యాలగూడ : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన దామరచర్ల మండలం వాడపల్లి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన ధనుంజయరావు (45), ఉప్పుటల నరసింహారావు (42) ద్విచక్ర వాహనం పై వాడపల్లి నుంచి దామరచర్లకు వెళుతుండగా, దాచేపల్లికి చెందిన డెక్క వెంకటేశ్వర్లు (23) మరో ద్విచక్ర వాహనం పై ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొట్టాడు.

ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ధనుంజయరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నరసింహారావును మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో వాడపల్లి, దాచేపల్లి ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story