- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ రకం కడుపు నొప్పి చాలా డేంజర్.. పాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు..?

దిశ, వెబ్‌డెస్క్: కడుపు నొప్పికి ఒక్క కారణం అంటూ ఉండదు. అనేక కారణాలు ఉంటాయి. కడుపు నొప్పికి కారణమయ్యే కొన్ని సాధారణ కారణాలు చూసినట్లైతే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఫుడ్ పాయిజనింగ్, కండరాల ఒత్తిడి, హార్ట్‌బర్న్, పెప్టిక్ అల్సర్ వ్యాధి, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్, అపెండిసైటిస్, క్రోన్'స్ వ్యాధి వంటివి కడుపు నొప్పికి కారణాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటితో పాటుగా కడుపు నొప్పికి కారణమయ్యే ఇతర కారణాలు.. ఉదరకుహర వ్యాధి, అండోత్సర్గము,జీర్ణశయాంతర అంటువ్యాధులు కూడా. ముఖ్యంగా అమ్మాయిలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంటుంది. అయితే ప్రతిరోజూ ఆకటి లేకపోవడం, సడన్‌గా వెయిట్ లాస్ అవ్వడం, పొట్ట నొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్ అని నిపుణులు తాజాగా వెల్లడిస్తున్నారు.
ఈ లక్షణాలు కనుక కనిపిస్తే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాంక్రియాటిక్ డక్టల్ అడినోకార్సిమా అనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్‌ను బయటకు తీసుకొచ్చే డక్ట్‌ల గోడల్లో ఉండే సెల్స్ అసాధారణ వృద్ధి వల్ల ఈ వ్యాధి సోకుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఇది ఇతర భాగాలకు కూడా సోకే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాగా నిపుణులు చెప్పిన లక్షణాల కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.