స్మోక్ చేయకపోతే.. ఆరు రోజుల అదనపు సెలవు!

by Dishafeatures2 |
స్మోక్ చేయకపోతే.. ఆరు రోజుల అదనపు సెలవు!
X

దిశ, ఫీచర్స్ : ఒత్తిడితో ఉద్యోగులు సిగరెట్ తాగడం కామన్. కానీ 'క్విక్ స్మోక్ బ్రేక్స్'లో బయటకు వెళ్లి ఎక్కువ సమయం గడపడం అనేది కంపెనీ ఉత్పాదకతను తగ్గిస్తుంది. అంతేకాదు పొగతాగని వారికంటే స్మోక్ చేసేవారే బయట టైమ్ పాస్ చేస్తుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అందుకే జపాన్‌లోని ఓ కంపెనీ ఈ విషయంపై కొత్త రూల్ తీసుకొచ్చింది. 'స్మోకింగ్' వల్ల కలిగే నష్టాలు గురించి ఎంతగా చెప్పినా, చివరకు కొవిడ్ వల్ల కూడా స్మోకర్స్‌కు అత్యధిక ముప్పుందని హెచ్చరించినా.. ఆ అలవాటును విరమించుకోని వారు ఎంతోమంది. ఈ క్రమంలోనే ఉత్పాదకతను ప్రభావితం చేసే 'స్మోకింగ్ బ్రేక్' విధానంపై జపాన్‌‌లోని మార్కెటింగ్ కంపెనీ 'పియాలా'కు చెందిన నాన్ స్మోకింగ్ ఎంప్లాయిస్ తమ పై అధికారులకు ఫిర్యాదును సమర్పించారు. దీంతో 'పెయిడ్ టైమ్' విధానంలో మార్పు చేసిన సంస్థ.. ధూమపానం చేయని సిబ్బందికి ఏడాదిలో ఆరు రోజుల పాటు అదనపు సెలవులు మంజూరు చేసింది.

WHO ప్రకారం, జపనీస్ పురుషుల కంటే జపనీస్ ఉమెన్ మూడు రెట్లు ఎక్కువగా ధూమపానం చేస్తారని CNBC నివేదించింది. ఈ క్రమంలో పియాలా కంపెనీ 'లీవ్ పాలసీ' అనౌన్స్‌మెంట్ ఉత్తమ ఫలితాలు కనబరిచిందని, ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు స్మోకింగ్ హ్యాబిట్ విడిచిపెట్టారని పేర్కొంది.మా నాన్-స్మోకింగ్ సిబ్బందిలో ఒకరి స్మోకింగ్ బ్రేక్స్ సమస్యలను కలిగిస్తున్నాయని, తరచుగా చాలా మంది ఉద్యోగులు సిగరెట్ తాగేందుకని ప్రతి రోజూ 15 నిమిషాలకు పైగా బ్రేక్ తీసుకుంటున్నారని కంపెనీ సజెషన్ బాక్స్‌ ద్వారా కంప్లయింట్ చేశారు. దీంతో ధూమపానం చేయని ఉద్యోగులకు పరిహారం చెల్లించేందుకు అదనపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. పెనాల్టీలు లేదా బలవంతంగా కాకుండా ప్రోత్సాహకాల ద్వారా ధూమపానం మానేసేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలని మేం ఆశిస్తున్నామని పియాలా ప్రతినిధి హిరోటకా మత్సుషిమా తెలిపారు.



Next Story

Most Viewed