మార్కెట్‌లో భారీ దొంగతనం.. వాటిని దోచుకెళ్లిన దొంగలు..

by Javid Pasha |
మార్కెట్‌లో భారీ దొంగతనం.. వాటిని దోచుకెళ్లిన దొంగలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట దొంగతనం జరుగుతుంటుంది. అందులో దొంగలు డబ్బులు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తులను దొంగలించి ఎవరికీ తెలియకుండా జారుకుంటారు. కానీ తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన దొంగతనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దేశంలోని పరిస్థితులకు ఈ సన్నివేశం అద్దం పడుతుందని కొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు సామాన్యుడికి అందని ద్రాక్షల్లా నిత్యావసరాలు దూరం జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొందరు వాటిని కొనడం కన్నా కొట్టేయడం మిన్న అనుకున్నారు.

అంతే ఓ మార్కెట్‌లోకి చొరబది 60 కిలోల నిమ్మకాయలు, 40 కిలోల ఉల్లిపాయలు, 38 కిలోల అల్లంతో పాటు ఓ ఫోర్క్‌ను కాజేశారు. పొద్దున్నే గూడైన్‌కు వచ్చి చూసిన యజమాని గుండె గుభేలుమంది. దాంతో అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తాను గూడౌన్‌కు వెళ్లే సరికే షాపు తాళాలు పగుల కొట్టి ఉన్నాయని, కూరగాయలు చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ దొంగతనంపై స్థానిక వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా దోచుకుపోతే తామేం కావాలంటూ మండిపడ్డారు. దీనిపై స్పందించిన పోలీసులు వీలైనంత త్వరగా దొంగలను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed