పెళ్లిలోకి వధువు ప్రియుడు ఎంట్రీ.. వరుడి ముందే అలా చేసి..

by Disha Web Desk 12 |
పెళ్లిలోకి వధువు ప్రియుడు ఎంట్రీ.. వరుడి ముందే అలా చేసి..
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు మనసులు మూడి పడటమే పెళ్లి. జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లిని అంగరంగవైభవంగా చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అలాంటి పెళ్లి వేడుకలో ఎటు చూసిన బంధు, మిత్రులతో కోలాహాలమే ఉంటుంది. అందరి కళ్లు నవ వధూవరుల పైనే ఉంటాయి. అలాగే వైభవంగా జరుగుతున్నపెళ్లిలో వధువు ప్రియుడు సడన్ ఎంట్రీ ఇచ్చి, అమ్మాయి మెడలో తాళి కట్టి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

నలంద జిల్లా ముబారక్‌పూర్ గ్రామానికి చెందిన ముఖేష్ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. జీవితాంతం ఇద్దరు కలిసి ఉండాలని అనుకున్నారు. అంతే.. ఆ విషయం ఇంట్లో తెలియడంతో అమ్మాయికి మరో సంబంధం నిశ్చయించి పెళ్లికి సిద్ధం చేశారు. మరోవైపు తమ అమ్మాయితో మాట్లాడకూడదని ఆమె కుటుంబీకులు ముఖేష్​ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే అమ్మాయికి నిశ్చయించిన ముహూర్తం ప్రకారం మంగళవారం పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లిలో జయమాల కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ముఖేష్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన వెంటనే వధువు మోడలో పూల దండ వేశాడు. అంతటితో ఆగకుండా పీటలపైనే వధువును కౌగిలించుకున్నాడు. పెళ్లి వేడుకకు వచ్చిన అందరు అది చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బంధువులు ముఖేష్‌ను చితకబాదారు. గ్రామస్థులు అతన్ని కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. ఈ ఘటనపై పోలీసులు ముఖేష్‌ని ఆరా తీయగా వధువుకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నారని చెప్పాడు. పెళ్లి జరగక ముందే వధువు ఫోన్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పెళ్లి వేడుకలో అలా చేసినట్లు తెలిపాడు. ముఖేష్ వాదన విన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story