నిజామాబాద్‌లో ఘోరం.. మంచి నీళ్లడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన వర్కర్

by Disha Web Desk 19 |
నిజామాబాద్‌లో ఘోరం.. మంచి నీళ్లడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన వర్కర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బట్టలు కోనేందుకు వచ్చిన వ్యక్తి దాహం వేస్తుందని నీళ్లడిగితే, నీళ్లబాటిల్‌కు బదులు యాసిడ్ బాటిల్ ఇవ్వగా వాటిని తాగిన వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని హూటా హూటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన శనివారం మధ్యహ్నం జిల్లా కేంద్రంలో వందసంవత్సరాల చరిత్ర కలిగిన సుల్తాన్ షాపింగ్ మాల్‌లో జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం అహ్మద్ నగర్‌కు చెందిన విజయ్ కుమార్ పెండ్లి షాపింగ్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని గాంధీ చౌక్‌లో ఉన్న సుల్తాన్ షాపింగ్ మాల్‌కు వచ్చాడు.

షాపింగ్ చేస్తూ మధ్యలో దాహం వేసి అక్కడ ఉన్న బాయ్‌ను మంచినీళ్లు ఇవ్వాలని కోరాడు. దానితో అక్కడ ఉన్న బాయ్ మంచినీళ్ల బాటిల్ బదులు యాసిడ్ బాటిల్‌ను అందించాడు. దానిని తీసుకున్న విజయ్ కుమార్ యాసిడ్‌ను మంచినీళ్లు అనుకుని తాగేశాడు. అయితే అది గాఢత తక్కువగా ఉండటంతో ముందుగా ఏమి అనిపించకపోగా.. కాసేపటికి విజయ్ కుమార్‌ కడుపులో మంట మంట అంటూ విల్లాడుతు పడిపోవడంతో కుటుంబ సభ్యులు, షాపింగ్ మాల్ నిర్వహకులు హుటా హుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు కోలుకోకపోవడంతో హైద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed