మిస్టరీగా వివాహిత మిస్సింగ్​.. మార్గమధ్యలో ఏం జరిగింది...?

by Disha Web |
మిస్టరీగా వివాహిత మిస్సింగ్​.. మార్గమధ్యలో ఏం జరిగింది...?
X

దిశ, అర్వపల్లి : వివాహిత మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కుంచం లిమెందర్, కవిత భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. లిమెందర్ కొన్ని నెలలుగా కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు. లిమెందర్ భార్య కవిత ఈనెల 2న తల్లిగారి గ్రామమైన కొమ్మాలకు వెళ్లింది. అదే రోజు కవిత కొమ్మాల నుండి సూర్యాపేటకు వెళ్లి వస్తానని చెప్పి నేటికీ తిరిగి ఇంటికి రాలేదు.

ఈ విషయాన్ని వెంటనే కవిత తల్లి అల్లుడు లిమెందర్ కు తెలిపింది. ఆమె కోసం బంధువుల ఇళ్లల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త లిమెందర్ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆరోపణలు ఎస్సై బి.అంజిరెడ్డి తెలిపారు. కాగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు ఏర్పడటంతో ఇటీవల పెద్దమనుషులు ఇరువురికి నచ్చజెప్పి కలిసి ఉండాలని చెప్పారు. ఇంతలోనే ఆమె అదృశ్యం కావడం చర్చనీయాంశం అయింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed