తెలంగాణ‌లో ఆ అంబులెన్స్‌లు ఏ 'మాయ' తున్నాయ్..​? లెక్కలకు చిక్కని వెహికల్స్!​

by Disha Web Desk 19 |
తెలంగాణ‌లో ఆ అంబులెన్స్‌లు ఏ మాయ తున్నాయ్..​? లెక్కలకు చిక్కని వెహికల్స్!​
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్​పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​పుట్టిన రోజు సందర్భంగా దాదాపు రెండేళ్ల క్రిందట ప్రారంభించిన గిప్ట్​ఏ స్మైల్​అంబులెన్స్​ల లెక్కలు దొరకడం లేదు. సుమారు 103 వాహనాలు ఇచ్చినట్లు నేతలు ప్రచారం చేస్తున్నా, అవి హెల్త్​డిపార్ట్​మెంట్​లెక్కల్లో లేవు. 2014–2015లో 336 అంబులెన్స్​లు ఉండగా, 2020–2021 డిసెంబరు వరకు 358 అంబులెన్స్​లు(108) నడుస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారికంగా ఇచ్చిన లెక్కల్లో పొందుపరిచింది. అంటే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన వాహనాల సంఖ్య కేవలం 22 మాత్రమేనని స్పష్టంగా అర్థం అవుతుంది. కానీ టీఆర్‌ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 అంబులెన్స్​ ల సంఖ్యను భారీగా పెంచామని లీడర్లు పైకి గొప్పలు చెప్పడం గమనార్హం. ఇటీవల మంత్రి హరీష్​రావు కూడా 108 వాహనాలను 430 పెంచామని చెప్పారు. కానీ వైద్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం తిరుగుతున్నది కేవలం 358 వాహనాలు మాత్రమే. అంటే మిగతా వాహనాలు ఎక్కడికి వెళ్లాయనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అంతేగాక గిప్ట్​ఏ స్మైల్​వాహనాలు అసలు ఆసుపత్రులకు ఇస్తున్నారా? లేదా ప్రచారం కోసం ప్రకటించి హామీలను గాలికి వదిలేస్తున్నారా? అని ప్రజల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు సీఎస్‌ఆర్​కింద వివిధ ప్రైవేట్​సంస్థలు అందిస్తున్న అంబులెన్స్​లెక్కలు కూడా వైద్యశాఖ వద్ద సమాచారం లేకపోవడం విచిత్రంగా ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హెల్త్​ రంగాన్ని బలోపేతం చేశామని గొప్పలు చెబుతున్న టీఆర్ఎస్, అంబులెన్స్​లపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

2014–15, 2020–21 లో ఇలా..(108 వాహనాలు)

2014–15 సంవత్సరంలో ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో 33 అంబులెన్స్‌లు ఉండగా, రంగారెడ్డిలో 41, హైదరాబాద్‌లో 25, మెదక్‌లో 27, నిజామాబాద్‌లో 28, ఆదిలాబాద్‌లో 34, కరీంనగర్‌లో 35, వరంగల్‌లో 41, ఖమ్మంలో 33, నల్గొండలో 39 చొప్పున మొత్తం 336 వాహనాలు ఉన్నట్లు వైద్యశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 సంవత్సరంలో మూడు వాహనాలు తగ్గి 333 మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక 2016–17, 2017–18, 2018–19 వరకు 337 వాహనాలు తిరగగా, 2019–20, 2020–21 నాటికి 358 వాహనాలు సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం అత్యధికంగా హైదరాబాద్‌లో 25, రంగారెడ్డిలో 23, నల్గొండలో 18, నిజామాబాద్‌లో 17 వెహికల్స్​తిరుగుతున్నాయి. అదే విధంగా మహబూబ్‌నగర్‌లో 11, నాగర్​కర్నూల్‌లో 10, వనపర్తిలో 6, గద్వాలలో 4, నారాయణపేట్‌లో 5, మేడ్చల్​ లో 16, వికారాబాద్‌లో 10, మెదక్‌లో 9, సంగారెడ్డిలో 14, సిద్ధిపేట్‌లో 13, కామారెడ్డిలో 13, ఆదిలాబాద్‌లో 10, నిర్మల్‌లో 6, మంచిర్యాలలో 10, ఆసీఫాబాద్‌లో 9, కరీంనగర్‌లో 11, పెద్దపల్లిలో 9, జగిత్యాలలో 7, సిరిసిల్లాలో 4, వరంగల్​ అర్బన్‌లో 9, వరంగల్​రూరల్‌లో 10, భూపాలపల్లిలో 5, మహబూబాబాద్‌లో 10, ములుగు 9, జనగామ 6, ఖమ్మం 14, కొత్తగూడెం 14, సూర్యాపేట్​ 12, యాదాద్రిలో 9 చొప్పున వాహనాలు పేషెంట్లకు సేవలు అందిస్తున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు.

104 ఒక్క వాహనం పెరగలే..

టీఆర్‌ఎస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 2014–15లో నూట తొబ్బైఎనిమిది 104 వాహనాలు ఉండగా, 2020–21 వరకు కూడా అన్ని వాహనాలు మాత్రమే ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ఇచ్చిన లెక్కల్లో పొందుపరిచారు. అంటే కనీసం ఒక్క వాహనం కూడా పెరగలేదని అర్థం అవుతున్నది.

గ్రామాల్లో గంటైనా వస్తలే..

పెరిగిన రోగాలు, జనాల అవసరాల నిమిత్తం ప్రతీ మండలానికో 108 అవసరం ఉండగా, టీఆర్‌ఎస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ చాలా మండలాల్లో అంబులెన్స్‌లు లేవు. దీంతో ఆయా పరిధిలో ని గ్రామాల్లోకి అంబులెన్స్‌లు గంటైనా రావడం లేదని జనాలు చెబుతున్నారు. ఫోన్లు చేసి వేచిచూడలేక సొంత వాహనాల్లో ఆసుపత్రులకు తీసుకువెళ్లాల్సి వస్తున్నది. ఇక అత్యవసర పరిస్థితుల్లోనైతే రోగులు నరకయాతన పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పేషెంట్​కాల్​చేసిన 15 నుంచి 20 నిమిషాల్లో వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కడా లేదని స్వయంగా వైద్యశాఖ ఆఫీసర్లే చెప్పడం ఆశ్చర్యం. పైగా మెజార్టీ అంబులెన్స్‌లో బేసిక్​లైఫ్​సపోర్టు వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎమర్జెన్సీ పేషెంట్లకు తిప్పలు తప్పడం లేదు. ఇక మారుమూల గిరిజ‌న ప్రాంతాల్లోని అంబులెన్స్​సైరన్లు ఎన్నడో బంద్​ అయిపోయాయి. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన రావడం లేదని ఓ ఎంపీటీసీ చెప్పారు.

దీంతో పాటు మారు మూల పల్లెల నుండి గ‌ర్భిణుల‌ను ఆసుప‌త్రుల‌కు, తిరిగి ఇంటికి చేర్చేందుకు ఏర్పాటు చేసిన అమ్మ ఒడి వాహ‌నాలు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. పల్లెల్లో వాహనాలు తిరగడం లేదు.



Next Story

Most Viewed