అతిగా జుట్టురాలుతోందా? ఇలా చేయండి ధృడమైన కురులు పొందండి

by Dishanational2 |
అతిగా జుట్టురాలుతోందా? ఇలా చేయండి ధృడమైన కురులు పొందండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆడవాళ్లకు అందం జుట్టు. ఇక జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండటానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అదే జుట్టు పెద్ద సమస్యగా మారిపోతుంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా జుట్టు అనేది ఊడిపోవడమో లేక తెల్లగా మారడమో జరుగుతుంది. అయితే ఇలా జుట్టు ఊడిపోకుండా, ధృడంగా ఉండటానికి, సరైన పోషణ అవసరం. అందువలన ఎలాంటి ఆహారం తీసుకోవడం వలన జుట్టు రాలిపోకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప‌దార్థాలు తీసుకొంటే జుట్టు రాల‌డాన్ని నియంత్రించే అవ‌కాశం ఉంటుంది అంటున్నారు నిపుణుల అవి ఎంటో చూసి మీరు కూడా పాటించండి.

బేకింగ్ సోడా : ఒక చెంచా బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులాతయారు చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేసి కండీషనర్ పెట్టుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతోంది.

బ్లాక్ టీ : బ్లాక్ టీ నీటిలో వేసి మరగ బెట్టాలి. అనంతరం అది చల్లారిన తర్వాత తలకు పెట్టుకుంటే జట్టును శుభ్రంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

ఆలోవెరా : ఆలోవెరా జుట్టుకు మంచి ఔషదంలా పనిచేస్తోంది. ఆలోవెరా జెల్‌ని నీటిలో మరిగించి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించడం వలన జుట్టులో చుండ్రు తగ్గి కురులు ధృడంగా తయారవుతాయి.


Next Story