ఏప్రిల్ నుంచి పెరగనున్న పారాసెటమాల్‌, అజిత్రోమైసీన్ ధరలు

by Harish |
ఏప్రిల్ నుంచి పెరగనున్న పారాసెటమాల్‌, అజిత్రోమైసీన్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్, పెయిన్ కిల్లర్స్‌తో కూడిన అవసరమైన మందుల ధరలు ఏప్రిల్ 1 నుండి పెరగనున్నాయి. జ్వరం, ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు, రక్తహీనత, గుండె జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగించే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM)లో దాదాపు 800 మందుల ధరలు 10.7 శాతం పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA), ఔషధ ధరల అథారిటీ టోకు ధరల సూచిక (WPI) ధరల పెంపును ప్రకటించింది. NLEMలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, ఫినోబార్బిటోన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, ఫెనిటోయిన్ సోడియం, మెట్రోనిడాజోల్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి.Next Story

Most Viewed