అలా భార్య కోరిక తీర్చిన పాకిస్థానీ

by Manoj |   ( Updated:2023-10-12 06:17:13.0  )
అలా భార్య కోరిక తీర్చిన పాకిస్థానీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ గంగూబాయి కతియావాడి చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిగా.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా మొదటి నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

కాగా, పాకిస్థానీ మోడల్, నటుడు మునీబ్ బట్ తన భార్యతో కలిసి అలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి' చిత్రాన్ని చూడటానికి దుబాయ్‌లో మొత్తం థియేటర్‌ని బుక్ చేశాడు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్ అవుతుంది. తన భార్యకు హాల్ మొత్తాన్ని బుక్ చేసానని, ఆమె కోసం ప్రైవేట్ షో ఏర్పాటు చేసినట్లు చెప్పడం వినవచ్చు. అయితే ఈ సినిమా మార్చి 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.



Next Story

Most Viewed