దోపిడీకి స్కెచ్ వేసిన తల్లి.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే?

by Disha Web Desk 7 |
దోపిడీకి స్కెచ్ వేసిన తల్లి.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు కారణం కావాలి. అడ్డదారులు తొక్కుతున్న పిల్లలను మందలించాలి. కానీ, కొడుకు చేసే చెడు పనులకు అడ్డుచెప్పకుండా తల్లిదండ్రులే తప్పు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించారు. ఓ మహిళ వారికి సూచనలు ఇచ్చింది. దారి దోపిడీకి ప్లాన్ వేసింది. ఆ మహిళ ఎవరో తెలుసుకుని పోలీసులు, స్థానికులు షాక్ అయ్యారు.

ఆ వివరాల్లోకి వెళితే.. గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి సమీపంలో చిత్తూరు హైవే వద్ద కేసీసీ నిర్మాణ సంస్థ పలు నిర్మాణాలు చేపడుతుంది. నిర్మాణాలు సజావుగా సాగుతున్నాయా లేదా.. అక్కడ అవసరాల నిమిత్తం ఆ సంస్థ పీఆర్‌ఓ పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు ఒకటో తేదీ కంపెనీ పీఆర్‌ఓ జాన్స్‌న్ హైవే పై ప్రయాణం చేస్తున్న సమయంలో అతడిపై దారిదోపీడి ముఠా దాడి చేసి రూ. 12లక్షలు దోచుకెళ్లారు. వెంటనే జాన్సన్ చిత్తూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి.. గురువారం ఉదయం 5 గంటలకు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. ఈ దోపిడీకి స్కెచ్ వేసింది గ్యాంగ్ లీడర్ భరత్ తల్లి తేజస్వినిగా విచారణలో తేలింది. దోపిడీ ముఠాలోని వారందరూ 20ఏళ్ల లోపు వయసువారే. పైగా నిందితుల్లో చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. జల్సాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ముఠా నాయకుడు మక్కిని భరత్‌తో పాటు కే. విక్రమ్, తేజశ్రీ, సందీప్, జి పవన్ కుమార్, ఏ చరణ్ రాజ్, ఏ లవ కుమార్, కె పవన్ కుమార్, వీ కృష్ణ లను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. రూపేష్, సాయి, పరంధామనాయుడు, ధనరాజ్ లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed