విషాదం: కొడుకు పుట్టిన ఐదురోజులకే తండ్రి మృతి..

by Disha Web |
విషాదం: కొడుకు పుట్టిన ఐదురోజులకే తండ్రి మృతి..
X

దిశ, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నగిశెట్టి వెంకన్న(32) గ్రామ శివారులో ఉన్న చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు వెంకన్నకు ఐదు రోజుల క్రితమే కొడుకు పుట్టడంతో ఆనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య మహేశ్వరీ, ఇద్దరు కూతుళ్లు, రోజుల వయసున్న కొడుకు ఉన్నాడు. సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story