బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Disha Web |
బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఘటనలను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం తెలిపారు.

"రాబోయే విద్యా సంవత్సరంలో, బాలికలపై లైంగిక వేధింపుల సంఘటనలను నిరోధించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది" అని మహారాష్ట్ర శాసనసభలో పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు గైక్వాడ్ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో 65,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 1,000కి పైగా CCTV కెమెరాలు ఉన్నాయని ఆమె సభకు తెలియజేశారు.

Next Story

Most Viewed