ప్రకృతి విపత్తు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే

by Batti.Sumithra |

గాలి, వానల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు.

ప్రకృతి విపత్తు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే
X

దిశ, నడిగూడెం : గాలి, వానల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. మండలంలోని కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేళ్ల వెంకన్న ఇల్లు ఇటీవల కురిసిన గాలి, వానల కారణంగా దెబ్బతినడంతో మంగళవారం మాజీ ఎమ్మెల్యే సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన ప్రతికుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. బాధితులను గుర్తించి వెంటనే నష్టపరిహారం అందజేయడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రకృతి విపత్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Next Story