టీబీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం

by Disha Web |
టీబీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని టీబీ పేషెంట్లందరికీ మరింత మెరుగైన ఇమ్యూనిటీ పుడ్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అందిస్తున్న ఆహారానికి డ్రై పుడ్స్‌ను కూడా కలిపి పంపిణీ చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే నిధులు మంజూరు చేయాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని టీబీ రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతీ గ్రామంలో క్యాంపులు పెట్టి శాంపిళ్లను సేకరించనున్నారు. పీహెచ్‌సీలతో అనుసంధానమై పేషెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. స్టేజ్‌ల వారీగా ఎంపిక చేసి మందులు పంపిణీ చేయనున్నారు. ప్రతీ ఆరు నెలలకోసారి టీబీ తీవ్రత, రికవరి విధానాలను డాక్టర్లు పరిశీలించనున్నారు. దాని ప్రకారం డ్రగ్స్​డోసులలో కూడా మార్పులు చేస్తారు.

Next Story