ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యం.. భారీ నజరానా ప్రకటించిన సర్పంచ్

by Disha Web Desk 2 |
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యం.. భారీ నజరానా ప్రకటించిన సర్పంచ్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కీసర మండల పరిధిలో గోధుమకుంటా గ్రామంలో సర్పంచ్ వినూత్న శ్రీకారం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పెంచటమే లక్ష్యంగా సర్పంచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలో విద్యార్థిని చేరిస్తే ఒక్కో విద్యార్థికి 5,000/- రూపాయల నజరానా ప్రకటించారు. తనవంతు చేయూతగా విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ఇంగ్లీష్ బోధన ఉన్నప్పటికీ తల్లిదండ్రులు గుర్తించటం లేదని ఆవేదన చెందారు. కార్పొరేట్ విద్య పేరుతో దోపిడీ జరుగుతున్నా.. తల్లిదండ్రులు మేలుకోవటం లేదన్న పాఠశాల హెడ్ మాస్టర్ నర్మదా, ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాఠశాల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు.


Next Story

Most Viewed