విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం : సీజీఆర్ఎఫ్ చైర్మన్

by Batti.Sumithra |

విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని సీజీఆర్ఎఫ్ చైర్మన్ చవాన్ జయవంతరావు అన్నారు.

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం : సీజీఆర్ఎఫ్ చైర్మన్
X

దిశ, రాజంపేట్ : విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని సీజీఆర్ఎఫ్ చైర్మన్ చవాన్ జయవంతరావు అన్నారు. దోమకొండ సబ్ డివిజన్ పరిధిలోని బీబీపేట, దోమకొండ, బిక్నూర్ నార్త్, బిక్నూర్ సౌత్, రాజంపేట్ మండలలకు సంబంధించి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక రాజంపేట్ విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజీఆర్ఎఫ్ చైర్మన్ చవాన్ జయవంతరావు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

వినియోగదారుల సమస్యల పై నిర్వహించిన పరిష్కార వేదికలో వివిధ గ్రామాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యల పై అర్జీలు అందించారని, 12 సమస్యలు పరిష్కారంచూపించబడ్డాయని, 5 ఫిర్యాదులు అందించిన‌ట్లు తెలిపారు. అత్యధిక మంది వినియోగదారులు అధిక విద్యుత్ బిల్లుల పై ఫిర్యాదులు చేశారన్నారు. విద్యుత్ సిబ్బందికి బిల్లులు చెల్లించేందుకు డైరెక్ట్ గా డబ్బులు ఎవరూ ఇవ్వవద్దని, ఆన్‌లైన్ ద్వారా బిల్లులు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ మెంబెర్ షేర్ల సత్యనారాయణ, ఫోర్త్ మెంబర్ రాజా గౌడ్, కామారెడ్డి ఏఈ సాలియా నాయక్, కామారెడ్డి ఏవో ఎస్ రాజశేఖర్, కామారెడ్డి డీఈ నందకుమార్, ఏడీఈ సుదర్శన్ రెడ్డి, ఏఈలు నాందేవ్, బాలాజీ, సంకీర్త్, విజయభాస్కర్, సబ్ ఇంజనీర్లు, అకౌంటెంట్ ఆఫీసర్స్, విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.

Next Story