రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక..

by Disha Web Desk |
రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక..
X

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు రేపు జరగనున్నాయి. శనివారం ఉదయం 10 నుంచి పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. పోలింగ్ నిర్వహించిన రోజునే ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. ఫలితాలు కూడా రేపే ప్రకటించవచ్చు. కాగా ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీతో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటేడ్ సభ్యులతో కలిపి ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు. ఉప రాష్ట్రపతిని ఎన్నుకొనేందుకు పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఓటు చేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రాల శాసససభ సభ్యులకు ఓటుహక్కు లేదన్నది తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాయి. కాగా జీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ జగ్‌దీప్ ధనకర్‌కు మద్దతు ప్రకటించింది. అయితే ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు విషయంలో ప్రతిపక్షాల్లోనే ఏకాభిప్రాయం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష బలాబలాలను బట్టి ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థికే భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed