'ఆ రైస్ కొనలేం'.. మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

by Disha Web Desk 19 |
ఆ రైస్ కొనలేం.. మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఆధ్వరంలో ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన దీక్షా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దీక్షపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పారా బాయిల్డ్ రైస్ కొనలేమని మరోసారి స్పష్టం చేసింది. 2021- 2022 రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రతిపాదనలను ఇంకా తెలంగాణ ప్రభుత్వం పంపలేదని కేంద్రం తెలిపింది. ప్రతిపాదనలను పంపాలని ఎన్నోసార్లు కోరినట్లు వెల్లడించింది. పారాబాయిల్డ్ రైస్ ఇవ్వమని.. రా రైస్ మాత్రమే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే ఎఫ్‌సీఐ దగ్గర మూడు సంవత్సరాలకు సరిపడా పారాబాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలు సరికాదంది.



Next Story

Most Viewed