సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లే దారిలో అక్రమ నిర్మాణాలు.. రోజుకో బిల్డింగ్ నిర్మాణం

by Disha Web Desk 13 |
సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లే దారిలో అక్రమ నిర్మాణాలు.. రోజుకో బిల్డింగ్ నిర్మాణం
X

దిశ, శామీర్‌పేట్ : సీఎం మానస పుత్రికగా పిలువబడుతున్న మూడు చింతలపల్లి మండలం.. తొలి దశ ఉద్యమకారుడు మేడ్చల్ సమితి అధ్యక్షుడు కామిడి వీరా రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మూడు చింతలపల్లి గ్రామంలో అక్రమాలకు అడ్డా కేంద్రంగా మారింది. ఈ గ్రామాన్ని కేసీఆర్ నూతన మండలంగా ఏర్పాటు చేసి దత్తత తీసుకుంటున్నాని ప్రకటించారు. సీఎం కేసీఆర్ నూతన మండలంగా ఏర్పాటు చేసి దత్తత తీసుకుంటున్నాని ప్రకటించారు. ఉమ్మడి శామీర్ పేట్ మండలం నుంచి 13 గ్రామాలను వేరుగా చేసి వీరా రెడ్డి జ్ఞాపకర్ధంగా మండలాన్ని ఏర్పాటు చేస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.


మూడు చింతలపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు, పాలకవర్గం కనుసన్నుల్లోనే అక్రమ నిర్మాణాలు యధేచ్చగా సాగుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లాలంటే నిత్యం ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తుండడంతో ఈ ప్రాంతమంతా షరా వేగంగా అభివృద్ధి చెందింది. దీంతో అక్కడి భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి అప్పటి నుంచి అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి.

పూటకో షెడ్డు.. రోజుకో బిల్డింగ్ నిర్మణం..


ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి. కానీ మూడు చింతలపల్లి గ్రామంలో అవేమి అవసరం లేకుండా అధికారులు, పాలకవర్గం చోటా మోటా నాయకుల చేతులు తడిపితే చాలు.. షెడ్లు, భవనాల నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

మామూళ్ల మత్తులో అధికారుల, పాలకవర్గం..

గ్రామ రెవెన్యూ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న ముందుగా హెచ్ఎండీఏ అనుమతులు కాకుండా అధికారులు, పాలకవర్గం అనుమతులు తీసుకోవాలి. వారికి చేతులు తడపాలి అప్పుడే వారి చల్లని చూపులతో నిర్మాణాలు జరుగుతాయాని అటు వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడరని స్థానికులు చెబుతున్నారు.

ఫిర్యాదు చేస్తే.. నోటీసులతో సరిపెడుతున్న వైనం..


గ్రామస్తులు ఎవరైనా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే పంచాయతీ అధికారి వారికి నోటీసులు ఇచ్చామని, పనులు కూడా ఆపించామని చెబుతున్నారని ఫిర్యాదారులు మండిపడుతున్నారు. అయితే అక్కడ నిర్మాణం జరగకుండా చూస్తే అప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన పని ఉండదు కదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అలాగే గ్రామంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది, పాలకవర్గం వారిది కదా అంటున్నారు.

మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వెనక కారణం ఏమిటి..?

అటు గ్రామ పంచాయతీ ఇటు మండల కార్యాలయం మధ్యలో కాస్త కూత వేటు దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకోకుండా అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు కానీ వ్యాపార నిర్మాణాలు కానీ చేస్తుంటే మండల స్థాయి అధికారులు సైతం ఎందుకు పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం మండల కార్యాలయానికి రాకపోకలు సాగించే మార్గం కానీ అధికారులకు కనిపించడం లేదంటే విడ్డురంగా ఉందని గ్రామస్తులు సెటైర్లు వేసుకుంటున్నారు.

గ్రామ పంచాయతీ ఇంచార్జి కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి వివరణ కోరగా :

మూడు చింతల పల్లి గ్రామంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై వివరణ కోరగా తాను రాకముందు నుంచే నిర్మాణాలు కొనసాగుతున్నాయని నేను విధుల్లో చేరిన తరువాత నా దృష్టికి వచ్చిన అక్రమ కట్టడాల నిర్మాణధారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది అన్నారు. మండల స్థాయి అధికారులకు అక్రమ కట్టడాల పై సమాచారం ఇచ్చాను.. వారికి కూడా తెలుసు అని వారి ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story

Most Viewed