ఈ ఏడాది నుంచే 'బ్యాచ్‌లర్​ఆఫ్​డిజైన్' కోర్స్.. కేటీఆర్ ఇలాకా నుంచే స్టార్ట్..

by Satheesh |
ఈ ఏడాది నుంచే బ్యాచ్‌లర్​ఆఫ్​డిజైన్ కోర్స్.. కేటీఆర్ ఇలాకా నుంచే స్టార్ట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సోషల్​వెల్ఫేర్​రెసిడెన్షియల్​స్కూళ్లలోని డిగ్రీవిద్యార్థుల కోసం ఇనిస్టిట్యూట్​ఆఫ్​టెక్నాలజీ సహకారంతో 'బ్యాచ్‌లర్​ఆఫ్​డిజైన్' అనే కొత్త కోర్సును అందుబాటులోకి తెస్తున్నారు. ఈమేరకు నేషనల్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​టెక్నాలజీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పలు అంశాలపై శనివారం చర్చలు జరిపినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్​లింబాద్రి తెలిపారు. 2022-23 విద్యాసంవత్సారానికి గాను ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. కాగా తొలుత ఈ కోర్సును శాతవాహన యనివర్సిటీ పరిధిలో మంత్రి కేటీఆర్​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సోషల్​వెల్ఫేర్​రెసిడెన్షియల్​ఇనిస్టిట్యూట్‌లో కోర్సును ప్రారంభించనున్నారు. అనంతరం ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు.



Next Story

Most Viewed