8 నిమిషాల్లో 50 శాతం చార్జ్.. హై ఎండ్ ఫీచర్లతో iQoo 9T 5G లాంచ్

by Disha Web Desk 17 |
8 నిమిషాల్లో 50 శాతం చార్జ్.. హై ఎండ్ ఫీచర్లతో iQoo 9T 5G లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్ అడుగు పెట్టింది. 5G వేరియంట్ iQoo 9T స్మార్ట్‌ఫోన్‌ మంగళవారం లాంచ్ అయింది. గేమింగ్ ఆడేటప్పుడు హీట్ కాకుండా ఉండటానికి మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. ఫోన్ కేవలం ఎనిమిది నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 49,999. 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999. ఇది ఆల్ఫా, లెజెండ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ కార్డు ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్‌లు రూ. 4,000 తగ్గింపు కూడా పొందవచ్చు.



iQoo 9T 5G స్పెసిఫికేషన్స్

* 6.78-అంగుళాల పూర్తి-HD+ E5 AMOLED (1,080 x 2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్, 1,500 నిట్, 1,500 శాతం బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది.

* గేమింగ్ కోసం, HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 256GB వరకు మెమరీని కలిగి ఉంది.

* Qualcomm Snapdragon 8+ Gen 1 SoCతో పాటు 12GB ర్యామ్‌‌ను అమర్చారు.

* Android 12, Funtouch 12, Adreno 730 పై రన్ అవుతుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 50 MP + 12 MP + 13 MP కెమెరాలు ఉన్నాయి.

* ముందువైపు 16-మెగాపిక్సెల్ కెమెరా.

* ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

* 120W ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని అందిస్తోంది.

* దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ కోసం IP52 రేటింగ్ కలిగి ఉంది.


Next Story

Most Viewed