టెట్‌ ఫైనల్‌ 'కీ' విడుదల

by Disha Web Desk |
టెట్‌ ఫైనల్‌ కీ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ఫైనల్ 'కీ' విడుదలైంది. టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం విడుదల చేసినట్లు ప్రకటించారు. జూన్ 12న టెట్‌ పరీక్ష నిర్వహించగా.. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్‌-2కు 2,51,070 మంది హాజరయ్యారు. ఈనెల 15న ప్రైమరీ కీ విడుదల చేయగా.. ఫైనల్‌ కీని బుధవారం అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను http://tstet.cgg.gov.in వెబ్​సైట్​లో చూసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా తొలుత ఫైనల్​కీని ఈ నెల 27న విడుదల చేస్తామని అధికారులు ప్రకటించినా ఆలస్యమైంది. అనంతరం జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. మొత్తానికి మంత్రి ప్రకటించిన రెండ్రోజుల ముందే అధికారులు ఫలితాలు విడుదల చేశారు.


Next Story