కొల్లాపూర్‌లో హై టెన్షన్.. తీవ్రస్థాయికి చేరిన ఎమ్మెల్యే, జూపల్లి మాటల యుద్ధం

by Disha Web |
కొల్లాపూర్‌లో హై టెన్షన్.. తీవ్రస్థాయికి చేరిన ఎమ్మెల్యే, జూపల్లి మాటల యుద్ధం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ కొల్లాపూర్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య సాగుతున్న ఆధిపత్యం, సవాళ్ళు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఆదివారం బహిరంగ చర్చలకు ఇరువురు నేతలు వేరువేరుగా ప్రకటనలు జారీ చేయడంతో.. ఈ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం సాయంత్రం నుండి కొల్లాపూర్‌లో అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతులు లేని సభలు, సమావేశాలు నిర్వహించరాదని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, మాజీ మంత్రి జూపల్లిని, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఇరువురి నేతల అనుచరులు ఉదయానికి మండలాల నుండి తమ నేతలకు మద్దతుగా తరలి వచ్చారు. మాజీ మంత్రి జూపల్లి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ఎమ్మెల్యే వర్గం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బహిరంగ చర్చకు వేదికగా నిర్ణయించిన అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకోవడానికి జూపల్లి వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణాల వల్ల కొల్లాపూర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో.. ఏం జరుగుతుందోనని సాధారణ జనం భయపడుతూ ఉండగా.. పోలీసులు పరిస్థితులు చేయి దాటకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed