YS Sharmila: ఏ రైతును అడిగి కేసీఆర్ ఆ సంతకం చేశారు..?

by Disha Web Desk 19 |
YS Sharmila: ఏ రైతును అడిగి కేసీఆర్ ఆ సంతకం చేశారు..?
X

దిశ, ఖమ్మం రూరల్: సీఎం కేసీఆర్ తప్పు చేసి కేంద్రంపై ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల పాదయాత్ర శుక్రవారం అరేకొడు నుంచి ప్రారంభమైంది. ముత్తగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ఊసరవెల్లి లాగా మాట మార్చుతున్నారు అని విమర్శించారు. ప్రతి సంవత్సరం యాసంగి వడ్లు కేంద్ర ప్రభుత్వం కొంటూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కేసీఆర్ బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని బీజేపీతో కుమ్మక్కై సంతకం చేసి వచ్చి.. ఇప్పుడు కేంద్రం కొనాలని ధర్నాలు చేయడం అంటే ప్రజలను పిచ్చివాళ్లను చేయడమే అన్నారు.

ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు యాసంగికి బాయిల్డ్ రైస్ వస్తుందని తెలియదా అని ప్రశ్నించారు. ఏ రైతును అడిగి కేంద్రం వద్ద సంతకం చేశారు అని నిలదీశారు. గత సంవత్సరం 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే కేసీఆర్ మాట విని ఈ యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారన్నారు. వరి వేయోద్దు అంటే 17 లక్షల ఎకరాల్లో వరి వేయలేదు అన్నారు. దీని వల్ల కూలీలకు ఉపాధి పోయిందని విమర్శించారు. వడ్లు కొనని ముఖ్యమంత్రి మనకు అవసరమా.. కేవలం పార్ బాయిల్డ్ మిల్లర్లు కోసమే ఈ డ్రామాలు అన్నారు. పరిపాలన చేతగాక వడ్లు కొనకుండా ఢిల్లీలో దొంగ డ్రామాలు చేస్తున్నాడు అని అన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విత్తనాలపై, ఎరువులపై సబ్సిడీ ఇచ్చి, పంట కొనుగోలుకు బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఏ సబ్సిడీలు లేవని తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కూతురుగా రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం అన్నారు. కేంద్రంలో డిజిల్, పెట్రో ధరల పెంపుకు కారణం బీజేపీ పార్టీ.. దానికి పోటీగా రాష్ట్రం పోటీ పడి రేట్లు పెంచుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి రాజకీయ వ్యభిచారం చేశారని విమర్శించారు. మీరు ఆశీర్వదిస్తే వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం.. మహిళల పేరున ఇళ్లు నిర్మించి ఇస్తాం అన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తాం.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసి చూపిస్తాం అన్నారు.


Next Story

Most Viewed